రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, మాస్ సాంగ్, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం నుండి అందరూ ఎదురు చూస్తున్న ’సరిలేరు నీకెవ్వరు’ డాంగ్ డాంగ్ ప్రొమో సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదల కాబోతోంది.
మరోవైపు జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నవిషయం తెలిసిందే.