బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:28 IST)
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అవ్వనున్నారు.
 
ఇదే సమయంలో జరగనున్న ఆల వైకుంఠపురంలో వేడుకకు మాత్రం ముఖ్య అతిథిగా ఎవ్వరు రావడంలేదట. టాలీవుడ్‌లో చిరును మించిన గెస్ట్ ఎవ్వరు లేరని, ఒకవేళ అల వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసినట్లు అవుతుందని బన్నీ భావిస్తున్నాడట. అందుకే చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవద్దని దర్శక, నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో ఎవర్ని పిలవకుండానే వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments