Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెట్స్ పైకి చిరంజీవి 152 చిత్రం షూటింగ్... ఆగస్టులో రిలీజ్

సెట్స్ పైకి చిరంజీవి 152 చిత్రం షూటింగ్... ఆగస్టులో రిలీజ్
, గురువారం, 2 జనవరి 2020 (21:01 IST)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. ఈ చిత్రం షూటింగ్ ఎపుడెపుడు ప్రారంభమవుతుందా అని మెగా అభిమానులంతా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో గురువారం నుంచి షూటింగ్ ప్రారంభమైంది. కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్ర షూటింగ్ జరుపుకుంది. పైగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకునిరావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ చిత్రం సోషియో థీమ్‌తో తెర‌కెక్కించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఎండోమెంట్స్ విభాగం మరియు దేవాలయాల నిర్లక్ష్యం సమాజంపై ఎంత చెడు ప్ర‌భావం చూపుతాయి అనేది ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నార‌ట‌ని టాక్. ఇక చిరు పాత్ర దేవాదయ, ధర్మా దయ శాఖలో పనిచేసే ఉద్యోగి అని స‌మాచారం. 
 
అంతేకాదు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై అతను ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి ప్రధాన కథాంశంగా తెలుస్తుంది. కాగా, తొలి షెడ్యూల్‌లో మాస్ సాంగ్ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం మణిశర్మ, కొరటాల శివ థాయిలాండ్ వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చొని మంచి ట్యూన్స్ సిద్ధంచేసినట్టు సమాచారం. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రంలో త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ అమ్మ ముద్దుబిడ్డలు.. 2020 బెస్ట్ ఫోటో ఇదే : మంచు మనోజ్