Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మిలియ‌న్ రియ‌ల్‌టైమ్ వ్యూస్‌తో రికార్డ్ సాధించిన మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (10:12 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రేక్షకులు, సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్‌ శుక్రవారం విడుదలైంది.
 
ఈ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లో వైరల్ అయ్యి రియల్ టైం వ్యూస్, లైక్ ల విషయంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. 40 గంటల్లోనే 20 మిలియన్ రియ‌ల్‌టైమ్ వ్యూస్ సాధించి 40 గంట‌ల పాటు కంటిన్యూగా యుట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం. ఈ టీజర్‌తో సినిమాపై అటు ప్రేక్ష‌కుల‌లో, ఇటు మ‌హేష్ అభిమానుల‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments