Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిలేరు నీకెవ్వరు సినిమాకి ప్రారంభం రోజునే ఏ సినిమా ఇన్‌స్పిరేష‌నో తెలిసింది..!

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (22:17 IST)
సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో విజ‌య‌శాంతి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని అనిల్ సుంక‌ర‌, దిల్‌ రాజు, మ‌హేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇదిలావుంటే.. ఈ మూవీ టైటిల్ లోగోని ప‌రిశీలిస్తే ఓ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. టైటిల్ ప‌క్క‌న తుపాకి, దానిపై ఉన్న‌ సోల్జర్ క్యాప్ చూస్తుంటే.. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ మిలటరీ నేపథ్యం ఉన్న కథతో తెర‌కెక్కుతోంద‌ని అర్థమవుతోంది. దీనిని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేసారు. ఈ లోగోని బ‌ట్టి సినిమా క‌థపై ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. 
 
అదేమిటంటే.. వెంకటేష్‌ ‘వారసుడొచ్చాడు’, మహేష్‌ ‘అతడు’ త‌ర‌హాలో ఈ చిత్ర‌క‌థ ఉంటుంద‌ట‌. అంటే.. ఒక‌రి స్థానంలోకి మ‌రొక‌రు (క‌థానాయ‌కుడు) వ‌చ్చే క‌థాంశంతో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. 
మిలటరీలో పనిచేసే మ‌హేష్‌ తన స్నేహితుడి కోసం అనుకోని పరిస్థితుల మధ్య ఆ స్నేహితుడి గ్రామానికి రావ‌డం, అక్కడ అతని కుటుంబానికి సాయపడటం వంటి అంశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ట‌. 
 
ఈ క‌థాంశం చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు మాత్రం చాలా హిలేరియస్‌గా ఉంటాయ‌ని టాక్‌. మ‌హేష్ బాబు స్నేహితుడు త‌ల్లి పాత్ర‌లో విజ‌య‌శాంతి క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వ‌మా..? కాదా...? అనేది తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments