Webdunia - Bharat's app for daily news and videos

Install App

`డాంగ్ డాంగ్`తో ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోన్నసూప‌ర్‌స్టార్ మ‌హేష్‌

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:23 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.
 
ఇప్ప‌టికే విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా సరిలేరు నీకెవ్వరు నుండి డాంగ్ డాంగ్ ఫుల్ లిరిక‌ల్‌ సాంగ్‌‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆజ్ రాత్ మేరే గ‌ర్ మే పార్టీ హై తు ఆజానా… అంటూ సాగే సరిలేరు నీకెవ్వరు నుండి డాంగ్ డాంగ్ ఫుల్ లిరిక‌ల్‌ సాంగ్‌ పార్టీ సాంగ్ మహేశ్‌, త‌మ‌న్నాల‌పై అమేజింగ్ స్టెప్స్‌తో అభిమానులు, ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా కంపోజ్ చేశారు.
 
ఈ సాంగ్‌లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో అదిరిపోయే స్టెప్పులేశారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌. ఈ న్యూ ఇయ‌ర్‌కి ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి వారిలో జోష్ నింపాడు దేవి శ్రీ. ఈ సాంగ్  థియేటర్లో అదరగొట్టడం ఖాయం అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులను కంపోజ్ చేశారు. ఈ పాట‌కు రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా న‌కాష్ అజిజ్‌, ల‌వితా లోబో ఆల‌పించారు.
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

New Political Party: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.. కొత్త పార్టీ పెట్టేదెవరంటే?

కన్నకూతురినే కిడ్నాప్ చేసారు.. కళ్లలో కారం కొట్టి ఎత్తుకెళ్లారు..

పెళ్లై 3 నెలలే, శోభనం రోజున తుస్‌మన్న భర్త: భార్య రూ. 2 కోట్లు డిమాండ్

Pawan Kalyan: ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన.. చర్చలకు సిద్ధమని పవన్ ప్రకటన

విజయవాడ భవానీపురంలో మహిళ పీక కోసిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments