Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (12:58 IST)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సొంతం చేసుకుంది. ఇపుడు ఈ రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 'ఆర్ఆర్ఆర్' తర్వాత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 14వ తేదీన విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలై వారం రోజులు కావొస్తున్నా కలెక్షన్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. పైగా థియేటర్ల వద్ద హౌస్‌‍ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వసూళ్ల పరంగా ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది.
 
తాజాగా ఈ మూవీ ఐదో రోజు రూ.12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాలలో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.13.63 కోట్లతో మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'సంక్రాంతికి వస్తున్నాం' (రూ.12.75కోట్లు), 'అల వైకుంఠపురంలో' (రూ.11.43కోట్లు), 'బాహుబలి-2' (రూ. 11.35కోట్లు), 'కల్కి 2898 ఏడీ' (రూ.10.86కోట్లు) ఉన్నాయి.
 
అటు ఓవర్సీస్ లోనూ వెంకీ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. వెంకటేశ్ కెరీర్‌లోనే అక్కడ ఆల్‌టైమ్ అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలిచింది. తాజాగా అక్కడ ఈ మూవీ రెండు మిలియన్ల మార్క్‌ను దాటినట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. 
 
కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ ఆల్బమ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elephant: ఇంట్లోకి ప్రవేశించిన అడవి ఏనుగు... బియ్యం సంచిని ఎత్తుకెళ్లింది (video)

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడిపై పోలీస్ కేసు.. ఎందుకో తెలుసా?

Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. వాషింగ్టన్‌లో భారీ బందోబస్తు.. అమెరికాలో అంబానీ

అమెరికాలో మరో తెలంగాణ బిడ్డ చనిపోయాడు.. ఎందుకో తెలుసా?

వైకాపా మళ్లీ వస్తుంది.. ఒక్కొక్కడినీ గుడ్డలూడదీసి నిలబెడతాం : ఖాకీలకు వైకాపా నేత వార్నింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments