ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఠాగూర్
గురువారం, 13 నవంబరు 2025 (09:22 IST)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే, ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా స్పందించారు 
 
'స్పిరిట్' మూవీలో చిరంజీవి నటిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. అయితే, నేను ఆయనకు పెద్ద అభిమానిని. భవిష్యత్‌లో మెగాస్టార్‌తో తప్పకుండా ఓ చిత్రం చేస్తాను. కానీ, అది 'స్పిరిట్' మాత్రం కాదు అని ఆయన స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూడాలనుకున్న మెగా అభిమానులకు కొంత నిరాశ ఎదురుకానుంది.
 
కాగా 'స్పిరిట్' చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. కానీ, ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు, వస్తున్న వార్తలు ప్రాజెక్టుపై ఉన్న హైప్‌ను భారీగా పెంచేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ వీడియో

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్

నాగుపాము పిల్లపై బైక్ పోనిచ్చాడు, చటుక్కున కాటేసింది (video)

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. చంద్రబాబు నాయుడు కూడా: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments