Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

Advertiesment
Chikiri

సెల్వి

, బుధవారం, 12 నవంబరు 2025 (11:17 IST)
Chikiri
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో వుంది. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ శరవేగంగా జరుపుకున్న తరుణంలో ఈ సినిమాలోని తొలి సింగిల్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. చికిరి చికిరి అనే పాటకు చెర్రీ చేసిన డ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ వర్గాల ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లతో పాటు సాధారణ ప్రజలు కూడా స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 
 
పెద్దిలోని చికిరి చికిరి పాట విదేశాల్లోని ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. జపాన్, అమెరికా వంటి పలు దేశాల్లో ఈ పాటకు స్టెప్పులేసి వీడియోలు పోస్టు అవుతున్నాయి. పెద్ది సినిమా నుంచి మొదటి పాటగా చికిరి చికిరి అనే ఈ సాంగ్‌కు రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ పాట రామ్ చరణ్, జాన్వి కపూర్ పై చిత్రీకరించారు. ఈ పాట చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌ లో ఉంది. రామ్ చరణ్ తన ప్రియురాలు జాన్వీకపూర్ అందం గురించి వర్ణిస్తూ వెంటపడే పాట ఇది. మోహిత్ చౌహన్ ఈ పాటను పాడారు. ఈ పాటకు నేపాల్ చెందిన ఓ యువతి స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె సిగరెట్ కాల్చుతూ చెర్రీ స్టెపులు వేసింది. ఈ మాస్ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 
ఇకపోతే..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల పాట కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాల మొదటి పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నయనతారని మీసాల పిల్ల అని టీజ్ చేస్తూ చిరంజీవి పాడే ఈ పాట బాగా క్లిక్ అయింది. ఈ పాటపై ఎన్నో రీల్స్ వచ్చాయి.ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ దక్కాయి. ఇలా ఒకేసారి తండ్రీ కొడుకుల పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు