బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

డీవీ
బుధవారం, 29 జనవరి 2025 (19:15 IST)
Sandeep Kishan -Majaka
సందీప్ కిషన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ (30వ సినిమా)గా రాబోతున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
సీనియర్ నటుడు రావురమేష్‌కు జోడీగా ‘మన్మధుడు’ ఫేం అన్షు నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా రావు రమేష్, సందీప్ కిషన్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయి. ఫిబ్రవరి 21న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మొదటి పాట బ్యాచ్‌లర్ యాంథమ్‌ను విడుదల చేశారు మేకర్స్.
 
బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ కుర్రాళ్లకు చార్ట్‌బస్టర్ కానుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటలో బ్యాచ్‌లర్స్ తమ జీవితంలో పడే వంట కష్టాలు, సింగిల్‌ షాపింగ్ ట్రిప్స్ వంటి వాటిని చాలాబాగా ఎలివేట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా తన గాత్రంతో కట్టిపడేశారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పాటకు మరింత ప్లస్ అయింది. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఈ పాటను సందీప్ కిషన్-రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు. తండ్రీకొడుకుల బ్యాచ్‌లర్ జీవితంలో ఎత్తుపల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా తీశారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పడిపడినవ్వేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఈ బ్యాచ్‌లర్ యాంథమ్ బ్లాక్‌బస్టర్ బిగినింగ్‌లా చెప్పొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments