సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్‌’ షూటింగ్‌ పూర్తి

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (19:02 IST)
Sampooresh
‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాలీఫ్లవర్‌’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్‌. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్‌ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, బ్యాంగ్‌ వీడియోకు మంచి స్పందన‌ లభించింది. ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌మ్యాన్‌గా సంపూ ఈ చిత్రంలో కనిపిస్తారు.
 
ఈ క్యాలీఫ్లవర్‌ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. లార్డ్‌ కృష్ణ అవతారంలో సంపూ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.
 
గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌ పతాకాలపై ఆశ జ్యోతి గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీకిరణ్‌ ఈ సినిమాకు కథ అందించారు.
 
సంపూర్ణేష్‌బాబు సరసన ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా నటిస్తున్నారు.ముజీర్‌ మాలిక్‌ ఛాయా గ్రాహ‌కునిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్నారు. బాబు ఈ సినిమాకు ఎడిటర్‌.
 
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌
దీప్‌
 
సాంకేతిక నిపుణులు
స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని
ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని
బ్యానర్స్‌: మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి
సమర్పణ: శ్రీధర్‌ గుడూరు
స్టోరీ: గోపి కిరణ్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments