Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబీ సింహా `వ‌సంత కోకిల` టీజ‌ర్ కు ఆద‌ర‌ణ‌

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (17:55 IST)
Boby simha
ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా రూపొందిన‌‌ ట్రైలింగ్వ‌ల్ మూవీ వ‌సంత కోకిల‌. ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది. వ‌సంత కోకిల్ అనే టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండస్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఈ సినిమా ప్ర‌మోష‌న్ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లై అన్ని వ‌ర్గాల అభిమానుల ఆద‌ర‌ణ అందుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతంది. 
 
డైలాగ్స్ లేకుండానే కేవ‌లం విజువ‌ల్స్ తోనే ఆద్యంతం ఉత్కంఠ‌ని క‌లిగించే రీతిన టీజ‌ర్ ని రెడీ చేయ‌డం విశేషం. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతియ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. థింక్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో రైట్స్ ద‌క్కించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments