Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016కి ఏమైంది..? సర్దార్, బ్రహ్మోత్సవం, కబాలి పోయె: కొబ్బరిమట్టపై సంపూ ఆసక్తికర ట్వీట్!

పెద్ద హీరోల సినిమాలు ఫట్ అయ్యాయని చెప్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం తనదైన కామెడీతో టాలీవుడ్‌ను షేక్ చేసే సంపూర్ణేష్.. తాజాగా ట్విట్టర్‌లో సరదాగా ఓ ట్వీ

Webdunia
బుధవారం, 27 జులై 2016 (17:29 IST)
పెద్ద హీరోల సినిమాలు ఫట్ అయ్యాయని చెప్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం తనదైన కామెడీతో టాలీవుడ్‌ను షేక్ చేసే సంపూర్ణేష్.. తాజాగా ట్విట్టర్‌లో సరదాగా ఓ ట్వీట్ చేశారు.
 
''ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్ధార్ గబ్బర్ సింగ్, మరోపక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష దోరణికి "కొబ్బరిమట్ట" పాడాలి చరమగీతం.." అని సంపూ తాజాగా ట్వీట్ చేశారు.
 
పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఫెయిల్ అయ్యాయని చెప్తూనే.. తన కొబ్బరి మట్ట సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటున్నడు. ఇలా పెద్ద సినిమాలపై కామెంట్ చేసే సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసింది సంపూ కాబట్టి.. అందరు హాయిగా నవ్వుకుంటున్నారు.
 
సాధారణంగానే సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటే సంపూర్ణేష్.. మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమానే తన ఆఖరి సినిమా అని ప్రకటిస్తే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలపైనే కామెంట్ చేశాడు. కాగా సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కాగా రీసెంట్‌గా రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. కొబ్బరిమట్ట మాత్రం తప్పకుండా అలరిస్తుందని సంపూర్ణేష్ నమ్మకంగా ఉన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments