Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావీ బ్యాంక్‌ విజయంలో అత్యంత కీలకంగా నిలిచిన తారాగణం: సమిత్‌ కక్కడ్‌

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (23:36 IST)
ఓ విజయవంతమైన షో రూపుదిద్దుకోవాలంటే, దానిలో నటించే తారాగణం కూడా సరైన వారై ఉండాలి. క్యారెక్టర్‌కు తగిన రీతిలో హావభావాలు పలికించగలిగిన మహోన్నతమైన ఫెర్‌ఫార్మర్లు ఎప్పుడూ కూడా అద్భుతాలనే చేయగలరు. ఎంఎక్స్‌ ప్లేయర్‌ యొక్క ఒరిజినల్‌ సిరీస్‌ ధారావీ బ్యాంక్‌ ఇప్పుడు నూతన శిఖరాలను చేరుకుందంటే కారణం అద్భుతమైన తారాగణమూ ఒక కారణం.
 
ఈ పది ఎపిసోడ్‌ల సిరీస్‌లో నేర సామ్రాజ్యపు మూలాలు తెలుసుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పొలీస్‌ ఆఫీసర్‌గా వివేక్‌ ఆనంద్‌ ఒబెరాయ్‌; తమిళ డాన్‌ తలైవన్‌గా నటించిన సునీల్‌ శెట్టిలు తమ నటనతో ఈ సిరీస్‌ను అత్యుత్తమంగా మారిస్తే, వీరికి మద్దతు అందిస్తూ తలైవన్‌ కుటుంబసభ్యులుగా శాంతిప్రియ,  భావనా రావు, వంశీకృష్ణ చేశారు. దక్షిణ భారతచిత్ర పరిశ్రమలో అపారమైన అనుభవం కలిగిన నటులను వ్యూహాత్మకంగా ఎంచుకోవడం ద్వారా ఈ షోకు  అథెంటిసిటీ తీసుకువచ్చారు.
 
అసాధారణమైన రీతిలో ఉంటున్న ఓటీటీ కంటెంట్‌ అసాధారణ ప్రతిభావంతులు, కథలకు జీవం పోస్తుంది. ధారావీ బ్యాంక్‌తో డిజిటల్‌ రంగంలో తొలిసారిగా సునీల్‌ శెట్టి కనిపించారు. తలైవన్‌గా తన వైవిధ్యమైన నటన, భాష, లుక్స్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. శాంతిప్రియ సైతం ఈ షో ద్వారా తెరకు తిరిగి పరిచయమైంది. ఆమె తలైవన్‌ సోదరిగా చేస్తే, తలైవన్‌ కుమార్తెగా భావనా రావు డిజిటల్‌లో తొలిసారిగా కనిపించారు. తలైవన్‌ పెద్ద కుమారునిగా వంశీకృష్ణ నటించారు.
 
ఈ షో తారాగణం ఎంపిక గురించి దర్శకుడు సమిత్‌ కక్కడ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ స్ర్కిప్ట్‌, వాస్తవికతను కోరుకుంది. ధారావీ బ్యాంక్‌ విజయంలో అధీకృత అనేది అత్యంత కీలక పాత్ర పోషించింది. దక్షిణ భారత మూలాలు కలిగిన వ్యక్తుల చుట్టూ తిరిగే కథనం కావడం, అద్భుతమైన నటీనటులు ఈ క్యారెక్టర్లకు లభించడం వల్ల  భాష, డైలాగ్‌ పలికే తీరు, సంస్కృతి మరింతగా మెరుగుపరచడం సాధ్యమైంది’’ అని అన్నారు. 
 
శాంతి ప్రియ మాట్లాడుతూ ఈ షో చేస్తున్నంత సేపూ మా ఫ్యామిలీ అన్నంతగా కలిసిపోయాము. అది మా నటనలో కూడా చూడొచ్చన్నారు. ఈ షో చేస్తున్నప్పుడు ఓ షెడ్యూల్‌ పూర్తి కాగానే మరో షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండే దానిని. ఈ సెట్స్‌పై పనిచేస్తున్నంత సేపూ ఉత్సాహం తారాస్థాయిలో ఉండేదని భావనా రావు అన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ స్ర్కీన్‌పై అత్యంత సహజంగా ఉండాలని సమిత్‌ కోరుకునే వారు. ఈ టీమ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. జీస్టూడియోస్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ప్రసారమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments