Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార హారర్ థ్రిల్లర్ కనెక్ట్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (19:35 IST)
Nayanthara, Connect
నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ "కనెక్ట్" సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు.
 
హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్  స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది.  అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన "గేమ్ ఓవర్" కూడా సూపర్ హిట్టయ్యింది. కనెక్ట్ చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.
 
ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కనెక్ట్‌ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
 
అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం - పృథ్వి చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్, పీఆర్వో - జీఎస్కే మీడియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments