Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్‌కే కాదు పిల్లలకు కూడా కరోనా

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (14:46 IST)
2012లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలో కనిపించి అల‌రించిన హీరోయిన్ సమీరా రెడ్డి.. 2014లో వ్యాపార వేత్త అక్షయ్‌ వార్డేను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంది. ప్రస్తుతం ఈమెతో పాటు.. ఆమె పిల్లలు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు సెల‌బ్రిటీల‌ను సైతం క‌రోనా గ‌జగ‌జ వణికిపోతున్నారు. తాజాగా తెలుగు హీరో ఎన్టీఆర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన న‌టి సమీరా రెడ్డి క‌రోనా బారిన ప‌డింది. ఆదివారం రోజు తాను క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలియ‌జేసిన స‌మీరా ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. 
 
"నా ముఖం మీద చిరున‌వ్వు తీసుకొచ్చే ఎంద‌రో నా చుట్టూ ఉన్నారు. ఈ స‌మ‌యంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాల‌ని పేర్కొంది. అయితే సోమ‌వారం ఉద‌యం నెటిజ‌న్స్ స‌మీరా పిల్ల‌ల గురించి ఆరాలు తీయ‌గా, హన్స్‌, నైరాల‌కు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని" చెప్పుకొచ్చింది.
 
గత వారం హన్స్‌కు అధిక జ్వరం, తలనొప్పి, క‌డుపు నొప్పితో కాస్త అల‌స‌ట‌గా ఉన్నాడు. నాలుగు రోజులు ఇలానే ఉండంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించాము. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. మొద‌ట్లో నాకు చాలా భ‌యం వేసింది. 
 
ఇక కూతురు నైరా గురించి మాట్లాడుతూ.. నైరాలో ల‌క్ష‌ణాలు వెంట‌నే క‌నిపించ‌డం ప్రారంభించాయి. పారాసెట్‌మాల్‌, కోల్డ్‌కు సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చాను. క్షేమంగానే ఉంది. సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది. పిల్ల‌లలో తేలిక‌పాటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. 
 
వైద్యులు మ‌ల్టీ విట‌మిన్స్, విట‌మిన్ సి సిఫార‌స్ చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా కరోనా‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. స‌మీరాతో పాటు ఆమె పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

దక్షిణాదిలో బీజేపీ ప్రచారాస్త్రంగా పవన్ కళ్యాణ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments