Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత యశోద చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (10:56 IST)
yashodha poster
సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద'. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని మరింత పెంచుతూ పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదల ప్లాన్ చేసింది చిత్ర బృందం. 
 
నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'యశోద' ట్రైలర్‌ను అక్టోబర్ 27న పేరొందిన పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
 
తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ 'యశోద' ట్రైలర్ విడుదల చేయనున్నారు.
 
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'యశోద' విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో ఖర్చుకు వెనకాడనట్టే, ప్రమోషన్స్ కూడా రొటీన్ కి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు దర్శకులు హరి, హరీష్ మరియు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.
 
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం.. వైరల్ అవుతున్న వీడియో (video)

చడీచప్పుడుకాకుండా గనుల రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు.. అభ్యంతరం చెప్పని ఏసీబీ

ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments