Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెబల్ గాళ్‌గా మేఘా ఆకాష్, మాటే మంత్రము ఫస్ట్ లుక్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (10:35 IST)
Megha Akash
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి,  అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నదీ సినిమా. 
 
బుధవారం హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది. హాకీ స్టిక్ పట్టుకుని స్మోక్ చేస్తున్న కావ్య డ్రీమ్స్, హాబీస్, ఎమోషన్స్ అన్నీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..."ఇవాళ మా హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు. బర్త్ డే విశెస్ చెబుతూ ఆమె నటించిన కావ్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. కావ్య ఒక రెబల్ గర్ల్. మేఘా ఆకాష్ ను ఇప్పటిదాకా చూడని కొత్త క్యారెక్టర్ లో చూస్తారు. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేశాం" అన్నారు.
 
నటీనటులు - రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అర్జున్ కళ్యాణ్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు 
సాంకేతిక నిపుణులు - సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కమల్, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి, పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్, నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం - అభిమన్యు బద్ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments