Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రమైన డ్రెస్ తో సమంత - ముంబైలోనేకాదు హైదరాబాద్ కు దారేదీ అని రాలేరా? త్రివిక్రమ్ ప్రశ్న

డీవీ
మంగళవారం, 8 అక్టోబరు 2024 (19:12 IST)
Samantha, Trivikram
సమంత హీరోయిన్ కాదు. హీరోనే. ఏమాయ చేశావే సినిమా వచ్చాక అల్లు అర్జున్ ఫోన్ చేసి. సమంత అనే హీరోయిన్ వచ్చింది. ఒకసారి సినిమా చూడు అన్నాడు. ఎందుకంటే తను సమంత ఫ్యాన్ అయ్యాడు ఆ సినిమాతో. అంతలా ఏక్ట్ చేసింది.. అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారంనాడు అలీయాభట్, సమంత తదితరులు నటించిన జీగ్రా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. వాసన్‌ బాలా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 11న విడుదలకాబోతుంది. ఈ వేడుకలో సమంత చిత్రమైన డ్రెస్ తో హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడారు. ఆలియా భట్ నటన గురించి చెప్పాల్సింది లేదు. నా ద్రుష్టిలో సమంత, అలియా ఇద్దరూ సేమ్. సెట్లో చాలా షార్ప్ గా వుంటారు. సమంత అయితే ఎంత యాక్టివ్ అంటే చావు సీన్ లోనూ నవ్వేస్తూ వుంటుంది. వెంటనే రియాక్షన్ మార్చేస్తుంది. గొప్ప ఆర్టిస్టు. అందుకే సమంత మీరు ఎప్పుడూ బొంబాయిలో వుండకండి... అత్తారింటికి దారేదీ లాగా.. సమంతకు హైదరాబాాద్ దారేదీ అని యాష్ టాగ్ తగిలించాలనుంది. సమంత తెలుగులో నటిస్తే నేను కథ రాస్తాను అని అన్నారు.
 
ఇంకా మాట్లాడుతూ, ఏ సంఘటనలు మనం ఊహించినట్లు జరగవు. కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి యాక్సెప్ట్ చేయాలి. నదిలో నీటి ప్రవాహం వస్తూనే వుంటుంది. అలానే మనం కూడా నీరులాగా వెళుతూ వుండాలి. మనపని మనం చేసుకుంటూ సాగాలి. ఇది నేను నేర్చుకున్న పాఠం. నేను ఈ ఫంక్షన్ వస్తానని అనుకోలేదు. వచ్చి రెండుగంటలు హ్యాపీగా అనిపించింది అన్నారు.
 
అలియాభట్ మాట్లాడుతూ,, జిగ్రా అంటే దైర్యం అని అర్థం. ఈ సినిమాలో నటించడం చాలా హ్యాపీగా వుంది. ఆర్.ఆర్.ఆర్. తర్వాత మా ఇంటిలో నాటునాటు సాంగ్ ప్రతిరోజూ పిల్లలు డాన్స్ చేస్తుంటారు. అంతలా నాకు పేరు తెచ్చిపెట్టింది. ఇక త్రివిక్రమ్ గారు సమంత, నేను నటించేలా కథ రాస్తారు అనుకుంటున్నా అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments