Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

fire accident

ఠాగూర్

, ఆదివారం, 6 అక్టోబరు 2024 (10:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించడంతో అందులోని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ఘోరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృత్తుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి... ఖండించిన తితిదే