సమంత అక్కినేని `ఫ్యామిలీ మేన్2` వెబ్ సిరీస్ చేసింది. లెక్కప్రకారం ఈ నెల 12వ తేదీన ప్రైమ్ వీడియోస్‌లో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అది కూడా మంచికే అంటోంది సమంత. వేసవిలో హాయిగా చూసుకోవడానికి సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో తెలియజేసింది. దర్శక ద్వయం రాజ్, డీకే సృష్టించిన `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.
ఈ రెండో సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణితో పాటు సమంత కూడా ముఖ్య పాత్రలో నటించింది. దీనిలో సమంత తీవ్రవాది పాత్రలో నటించింది. దీంతో ఈ సిరీస్ కోసం సమంత అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ``ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు.
మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకే విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం` అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. నాలో తీవ్రవాదిని అప్పుడు చూడండంటూ చలోక్తి విసిరింది.