Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (19:05 IST)
Samantha
ప్రముఖ సినీ నటి సమంత శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆమె బ్యానర్‌లో నిర్మిస్తున్న శుభం చిత్రం బృందంతో కలిసి ఆమె దర్శనంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం, సమంత, శుభం చిత్ర యూనిట్ సభ్యులు వీఐపీ విరామ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఈ బృందానికి స్వాగతం పలికి, వారి సందర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
 
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సమంత, చిత్ర బృందానికి వేద పండితులు ఆశీస్సులు అందించారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానికి ముందు, సమంత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తన డిక్లరేషన్‌ను సమర్పించింది.
 
గత ఏడాది సమంత త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. శుభం ఈ బ్యానర్‌పై నిర్మించబడుతోంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందంతో కలిసి ఆమె తిరుమల పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments