Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

Advertiesment
snake

ఠాగూర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (14:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్యామల రావు నివాసం ఉండే తిరుపతిలోని బంగ్లాలోని గురువారం రాత్రి భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు తితిదే రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా ఊహించని విధంగా ఆయన చేతిపై పాము కాటు వేసింది. అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంటీ వీనమ్ మందులతో చికిత్స చేశారు. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 
 
పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య! 
 
పలువురు అమ్మాయిలు ప్రేమవలలో చిక్కుకుని మోసపోతున్నారు. దీంతో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో అతని ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. 
 
అస్సాంకు చెందిన సుల్తానా బేగం (26) అనే యువతి సిద్ధిఖ్ నగర్‌లోని ఓ హోటల్‍‌లో వెయిటర్‌గా పని చేస్తుంటే, ఆమెకు అక్కడే హోటల్ యాజమాన్యం బసవసతి కల్పించింది. మరో హోటల్‌‍లో వెయిటర్‌గా పని చేసే కోల్‌కతాకు చెందిన సయ్యదుల్ షేక్ (29) అనే వ్యక్తి అంజయ్యనగర్‌ బంజారా బస్తీలో ఉంటున్నాడు. అతనితో సుల్తానాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలంగా ప్రేమించుకోసాగారు. అయితే, పెళ్లి ప్రస్తావన తీసుకునిరాగానే ముఖం చాటేశాడు. పైగా ఆమె ఫోను నంబర్‌‍ను సైతం బ్లాక్ చేశాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో స్నేహితుల ఫోన్‌తో తన ప్రియుడుకి కాల్ చేసింది. తన తల్లిదండ్రులు  సంబంధాలు చూస్తున్నారని తనను వివాహం చేసుకోవాలని ప్రాధేయపడగా, అతను నిరాకరించాడు. దీంతో ఆమె ఉదయం 5 గంటల సమయంలో అతడుంటున్న భవనానికి వచ్చి ఐదో అంతస్తుపైకి చేరుకుని అక్కడ నుంచి కిందకు దూకి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!