Plane Flies Over Tirumala
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం ఎగిరింది. ఈ ఘటనపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా విమానయాన శాఖ పట్టించుకోవట్లేదని భక్తులు ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని తితిదే ఖండించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి రాకపోకలు నిషిద్ధం. ఇలా జరగడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలో కూడా ఫ్లైట్లు తిరుమల గుడిపై నుంచి వెళ్లాయి. ఈ విషయాన్ని పలుమార్లు విమానయాన శాఖ మంత్రి దగ్గరకి తీసుకెళ్లారు తిరుపతి దేవస్థాన సిబ్బంది.
ఇక నుంచి ఆలయ గోపురం పైనుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గతంతో పోలిస్తే గురువారం ఆలయ గోపురానికి దగ్గరగా విమానం వెళ్లింది. విమానయాన శాఖ వైఖరిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.