Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ భర్తతో సమంత రొమాన్స్.. విజయ్ సేతుపతిలో ఛాన్స్

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (12:05 IST)
పెళ్లికి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో సమంత హిట్ కొట్టింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్ ఓ బేబీ ద్వారా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం సమంత ఈ ఏడాది సినిమాలతో హిట్ కొట్టేందుకు సిద్ధమైంది. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. 
 
ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక ''96''ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సమాచారం. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.
 
తాజా సమాచారం ప్రకారం సమంత మరో తమిళ ప్రాజెక్ట్‌ని ఒకే చేసిందట. హీరోయిన్ స్నేహ భర్త నటుడు ప్రసన్న సరసన ఓ మూవీలో హీరోయిన్‌గా సమంత నటించనుంది. ఈ చిత్రానికి కూడా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తారట. అశ్విన్ ఇంతకుముందు తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గేమ్ ఓవర్' చిత్రాన్ని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments