Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

చిత్రాసేన్
సోమవారం, 27 అక్టోబరు 2025 (18:22 IST)
Samantha pooja Maa Inti Bangaram
ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను స‌గ‌ర్వంగా ప్రారంభించిన‌ట్లు అనౌన్స్ చేశారు మేక‌ర్స్‌. ఈ ఏడాది బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో స‌మంత‌, దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి గౌత‌మి, మంజుషా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.
 
ఈ చిత్రానికి స‌మంత‌, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాత‌లు. ఓ బేబి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సమంత‌, నందినీ రెడ్డి  కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఓం ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా... సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీన‌న్. వ‌సంత్ మరిన్‌గంటి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. ప‌ల్ల‌వి సింగ్ కాస్ట్యూమర్, ఉల్లాస్ హైద‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్, ధ‌ర్మేంద్ర కాక‌రాల ఎడిట‌ర్‌గా వ‌ర్క్‌చేస్తున్నారు.
 
సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ క‌ల‌యిక‌, ఆశీర్వాదాల‌తో సినిమా ప్రారంభ‌మైంది. మూవీ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే గ్రిప్పింగ్ యాక్ష‌న్ డ్రామాగా అనిపించింది. అద్భుత‌మైన యాక్ష‌న్ బ్యాంగ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌ని ఈ సందర్భంగా మేక‌ర్స్ తెలియ‌జేశారు. సినిమా షూటింగ్ ప్రారంభ‌మైందని, మ‌రిన్ని వివ‌రాల‌ను తెలిజేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

తుఫాను ప్రారంభమైంది... భూమిని సమీపించే కొద్దీ తీవ్రమవుతుంది.. ఏపీఎస్డీఎంఏ

ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

అమరావతిలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్.. నారా లోకేష్‌ ప్రధాన ప్రాజెక్ట్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments