నా కుటుంబంపై ప్రభావం చూపని పాత్రలే చేస్తాను.. సమ్ముకు చైతూ చెక్

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (12:43 IST)
నాగచైతన్య "లవ్ స్టోరీ" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో `బంగార్రాజు` మూవీలోనూ నటిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈయన చేతుల్లో ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ సమంతను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల చైతు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ యాంకర్ "మీరు ఎలాంటి పాత్రలను చేయడానికి ఆసక్తి చూపరు?" అని అడిగారు. 
 
అందుకు చైతు స్పందిస్తూ.. "నేను అన్నీ తరహా పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు. నా కుటుంబంపై ప్రభావం చూపే విధంగా ఉంటే మాత్రం చేయను" అని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు చైతు సామ్ గురించే మాట్లాడడని, ఆమెపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇంకా చైతూ మాట్లాడుతూ..  "నేను దాని గురించి మాట్లాడటం పూర్తయిందని అనుకుంటున్నాను. దాని గురించి మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను." అని చెప్పాడు. 
 
అయితే సమంత కూడా మాట్లాడుతూ, "నేను నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతాను, ఇది నా వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. కొంతమంది వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడరు. నేను నా జీవితం చాలా పారదర్శకంగా ఉంటుంది" అని సమంత చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments