Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూని గుర్తుచేసుకున్న సామ్-మజిలీలా కలిసిపోవచ్చుగా..?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (19:46 IST)
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయాక ఇప్పటివరకు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, పోస్టులు పెట్టలేదు. తాజాగా సమంత ఓ పోస్ట్‌ని తన స్టోరీలో పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 
 
సమంత, చైతూ కలిసి చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా మజిలీ. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో సమంత తన ఇన్‌స్టా స్టోరీలో మజిలీ పోస్టర్‌ని పెట్టింది. అయితే సమంత సింగిల్ పోస్టర్ పెట్టకుండా, చైతూ సింగిల్‌గా ఉన్న పోస్టర్‌ని పెట్టింది. ఆ పోస్టర్‌లో వెనకాల చైతూ ఇద్దరు హీరోయిన్స్‌తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. 
 
సమంత ఇలా మజిలీ సినిమా పోస్టర్‌ని చైతూ ఫోటోతో పెట్టడంతో అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మజిలీ లాగా ఇద్దరు మళ్ళీ కలిసిపోవచ్చు కదా, ఇద్దరు ఆ సినిమాలో లాగా అర్ధం చేసుకొని బతకొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు.
 
కొంతమంది అయితే అవన్నీ సినిమాల్లోనే రియల్ లైఫ్ వేరు అని అంటున్నారు. మొత్తానికి చైతూతో విడాకుల అనంతరం సమంత వారిద్దరూ కలిసి చేసిన సినిమా పోస్టర్‌ని పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments