వెడ్డింగ్ షూట్ నవ దంపతుల కొంపముంచింది. కేరళలో సాహసోపేతమైన ఓ వెడ్డింగ్ షూట్‌లో వరుడు మృతి చెందాడు. వధువు పరిస్థితి విషమంగా వుంది
వివరాల్లోకి వెళితే.. కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వధువు పరిస్థితి విషమంగా వుంది.
కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు.
వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.