Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారండోయ్ రూ.35కోట్ల రికార్డు.. సమంత ఇక హీరోయిన్‌గా వెండితెరపై కనిపించదా?

అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రికార్డు సాధించింది. ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ర

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (11:29 IST)
అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రికార్డు సాధించింది.  ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది. నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. 
 
ఈ నేపథ్యంలో చైతూ మనువాడనున్న హీరోయిన్‌ సమంత ఇకపై వెండితెరపై కథానాయికగా కనిపించబోదని టాక్ వస్తోంది. గ్లామర్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న సమంత త్వ‌ర‌లో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత సమంత హీరోయిన్‌గా చేస్తుందా, చేయదా? అసలు సినిమాలకే గుడ్ బై చెబుతుందా? అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు రీజన్ కూడా ఉంది. సమ్మూ పెళ్లికి కొన్ని నెలలకు ముందే సినిమాలను బాగా తగ్గించుకుంది. ఉన్న సినిమాలు కంప్లీట్ చేసుకుంటుంది. జనతాగ్యారేజ్ తర్వాత శామ్ చాలా గ్యాప్ తీసుకుంది. 
 
తాజాగా చెర్రీతో చేసే మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న సామ్ మ‌హా న‌టి, రాజు గారి గ‌ది2 వంటి సినిమాల‌లో కీలక పాత్రల్లో కనిపించనుంది. నాగశౌర్య చేయబోయే కొత్త‌ మూవీలోను సమంత స్పెషల్ రోల్ చేస్తోందని వార్తల్లొచ్చాయి. వీటిని బట్టి చూస్తే సమంత ఇకపై హీరోయిన్‌గా తెరపై కనిపించదని, స్పెషల్ రోల్స్‌కే పరిమితం అవుతుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments