Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనే.. సమంత

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:30 IST)
రియల్‌ లైఫ్‌కు రీల్‌ లైఫ్‌కు చాలా తేడా ఉందని రియల్ లైఫ్‌లో తాజాగా భార్య పాత్రలోకి ప్రవేశించిన కథానాయిక అక్కినేని సమంత అంటున్నారు. వివాహమైన తర్వాత ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మొదటి చిత్రం ‘మజిలీ’... ఇందులో మరో కథానాయికగా దివ్యాంశా కౌశిక్‌ కూడా నటిస్తున్నారు.


శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదలకు సిద్ధమౌతోంది. ఇటీవల డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాలో చైతన్య ప్రేయసిగా దివ్యాంశ, భార్యగా సమంత కనిపించనున్నారు.
 
కాగా... ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. అందులో చైతన్య.. నటి దివ్యాంశను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ‘రంగస్థలం’ సినిమాలోనూ సమంత కథానాయకుడు రామ్‌చరణ్‌ను ఓ సన్నివేశంలో ముద్దుపెట్టుకున్నారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ‘నేను కేవలం చరణ్‌ బుగ్గలపై ముద్దుపెట్టా, ఆ సీన్‌ సుకుమార్‌ కెమెరా ట్రిక్‌’ అని సమంత అప్పట్లో స్పందించారు.
 
అయితే.. తాజా ఇంటర్వ్యూలో ‘మజిలీ’లోని నాగ చైతన్య ముద్దు సన్నివేశం గురించి సమంతను యాంకర్‌ ప్రశ్నించగా... దీనికి ఆమె సానుకూలంగా స్పందిస్తూ... నటనలో ఇవన్నీ భాగమని చెప్పుకొచ్చారు. ‘మా మధ్య అద్భుతమైన బంధం ఉంది, మేం మంచి స్నేహితులం, పెళ్లి కూడా చేసుకున్నాం.. ముందు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి.


నటనకు, నిజానికి మధ్య చిన్న గీత ఉంటుంది. నా పరంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనే. ఈ విషయాన్ని నేను అభిమానులకు కూడా చెప్పాలి అనుకున్నా. ఇదే రూల్‌ నాకు, చైతన్యకూ వర్తిస్తుంది’ అని సమంత పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments