Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చర్మం పాడైంది.. సమంత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:59 IST)
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అమెరికాలో మయోసైటిస్‌కు చికిత్స పొందుతోంది. ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత సినిమాల్లో నటించడానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డికె దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 
 
ఇవి తప్ప సమంత చేతిలో వేరే సినిమాలు లేవు. ఇక సమంత వేరే సినిమాలకు ఒప్పుకోకుండా ఏడాది పాటు బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్లి మైయోసైటిస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. 
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో సెషన్‌లో సమంత ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె స్కిన్ గ్లో పాడైపోయిందని అర్థమైంది. దీంతో ఓ అభిమాని నీ స్కిన్ ఏమైందని అడిగాడు. 
 
ఇందుకు సమంత సమాధానం ఇచ్చింది, "మయోసిటిస్ కోసం ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నా చర్మంపై కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఫిల్టర్‌ని ఉపయోగించి మీతో మాట్లాడుతున్నాను." అంటూ అసలు విషయం చెప్పింది. 
 
తన చర్మ సమస్యను పరిష్కరించే బాధ్యతను చిన్మయి తీసుకుందని సమంత సరదాగా చెప్పింది. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఈ స్కిన్ అలర్జీ వస్తోందని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments