మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నోటీసులు

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:32 IST)
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటుడు నవదీప్‌కు హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేశారు. 41ఏ కింద వీటిని నవదీప్‌కు అందచేసి, ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
ఇటీవల వెలుగులోకి వచ్చిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ37గా ఉన్న తన ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో తన పేరు వినపడగానే నవదీప్ హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నవదీప్‌కు షాకిస్తూ, విచారణకు నవదీప్ సహకరించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

Students: పాదాలకు విద్యార్థులచేత మసాజ్ చేసుకున్న టీచర్.. వీడియో వైరల్

రూ.20 కోట్ల ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసింది.. కానీ పోలీసులకు చిక్కింది.. ఎలా?

టెలివిజన్ నటిపై లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments