అంతా మన మంచికే.. నా జీవితం ఇలా మారుతుందని..?: సమంత

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:30 IST)
ఏ మాయ చేసావె సినిమాతో సమంత స్టార్ అయిపోయింది. అబ్బాయిల డ్రీమ్‌గర్ల్‌గా మారింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తరువాత ఆమె అనారోగ్యం (మయోసిటిస్) బారిన పడింది. దాని నుంచి కోలుకుని ప్రస్తుతం సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. 
 
తాజాగా సమంత అభిమానులతో ముచ్చటించిన వివరాలను ఇన్ స్టాలో షేర్ చేసింది. అభిమానుల కోసం ఓ యాక్షన్ సినిమా చేస్తానని చెప్పింది. అదే సమయంలో కొత్తవారికి స్ఫూర్తిదాయకమైన మాటలు మాట్లాడింది. తన జీవితం ఇలా ఉంటుందని ఊహించలేదని చెప్పింది. 
 
చిన్న చిన్న విషయాలకే మీ జీవితం ముగిసిపోయిందని భావించకండి, మీ జీవితం ఇప్పుడే మొదలైందని సమంత నేటి యువతకు సందేశం ఇచ్చింది. జీవన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సమంత తెలిపింది. 
 
ఇలాంటి కష్టాలు, సమస్యలే మనల్ని దృఢంగా మారుస్తాయని, మరింత దృఢంగా తయారవుతాయని సమంత వెల్లడించింది. ఈ సందర్భంగా తన అనుభవాలను వివరిస్తూ.. 25 ఏళ్ల వయసులో తన జీవితం ఇలా మారుతుందని ఊహించలేదని తెలిపింది. 
 
జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయని ఊహించలేదని, ఏం జరిగినా సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని, అంతా మన మంచికే అని ఆలోచించాలని సమంత చెప్పింది. 
 
యాక్షన్ సినిమా చూడాలనుకుంటున్నామని ఆ అభిమాని చెప్పగా, సిటాడెల్‌లో యాక్షన్‌ ఉంటుందని, తన పాత్ర హాట్‌గా, ఫన్నీగా ఉంటుందని, చాలా సవాళ్లతో ఆ పాత్ర చేశానని సమంత వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments