Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత స్పెషల్ సాంగ్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (18:45 IST)
Pushpa- Samantha
స‌మంత తాజాగా పుష్ప సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తోంది. ఈ పాట సోవారంతో పూర్త‌యింది. అందుకే చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇది ఐటం సాగ్ కాద‌నీ, స్పెష‌ల్ సాంగ్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. మ‌రి సినిమాలో చూసేవ‌ర‌కు ఆమె ఏ త‌ర‌హా పాట చేసిందో తెలియ‌దు. కాబ‌ట్టి స‌మంత మామూలు పిక్‌ను విడుద‌ల చేసింది.
 
ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ హీరోయిన్ సమంత కాలు కదపనున్నారు. పుష్ప లో  5వ పాట మరింత స్పెషల్‌గా ఉండబోతుంది. సమంత గారి ఎంట్రీతో ఆ పాట మరింత స్పెషల్ అయిపోయింది అంటూ చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసారు. కెరీర్‌లో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు సమంత. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 19న 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే నాలుగో సింగిల్‌ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments