Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప లో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా - అంటోన్న అల్లు అర్జున్

Advertiesment
పుష్ప లో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా - అంటోన్న అల్లు అర్జున్
, సోమవారం, 15 నవంబరు 2021 (09:25 IST)
Pupsha - Arjun
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. 
 
వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే నాలుగో సింగిల్‌కు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. నవంబర్ 19న పూర్తి పాట విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
 
నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి చౌరాసియాపై దాడికి తెగబడిన దుండగుడు