Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టరుతో సమంత నిశ్చితార్థం?

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:03 IST)
ఇటీవలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలకు నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగి వారం రోజులు కూడా పూర్తికాలేదు. అయితే, నాగ చైతన్య మాజీ భార్య, సినీ హీరోయిన్ సమంత నిశ్చితార్థం కూడా జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తాను నటిస్తున్న వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో నిశ్చితార్థం చేసుకున్నట్టు సమాచారం. ఆ జాతీయ పోర్టల్‌లో వచ్చిన ఈ వార్త ఇపుడు వైరల్‌గా మారింది. 
 
రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్టు సమాచారం. గతంలో రాజు డికేతో కలిసి సమంతతో 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే సిరీస్ చేసింది. ఈ సిరీస్‌లో సమంత నటించిన తీరు కాంట్రవర్సీలకు దారితీసింది. ఆ తర్వాతే నాగచైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా ఒక నేషనల్ పోర్టల్లో వచ్చిన కథనం ప్రకారం రాజ్ - సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. 
 
రాజ్‌కి ఇప్పటికే వివాహం కూడా జరగగా, సమంతతో ప్రేమలో పడిన నేపథ్యంలో అతని భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో రాజ్ ఉన్నట్లు సదరు వార్తా కథంలో పేర్కొంది. అయితే, ఇందులో ఎంత నిజముందో తెలియాల్సివుంది. విడాకులు తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే ఘనంగా నిర్వహించటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక సమంత  రాజ్ డీకే దర్శకత్వంలోనే 'సిటాడెల్', 'హనీ బన్నీ' అని ఒక వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అది త్వరలో స్ట్రీమింగ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments