Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత మంచి మనసుకు నెటిజన్లు ఫిదా..

పెళ్లికి తర్వాత రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంత అక్కినేని ప్రస్తుతం కన్నడలో విజయం సాధించిన యూటర్న్‌ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల టాకీ పార్ట్‌ను శరవ

Webdunia
శనివారం, 14 జులై 2018 (12:35 IST)
పెళ్లికి తర్వాత రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంత అక్కినేని ప్రస్తుతం కన్నడలో విజయం సాధించిన యూటర్న్‌ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల టాకీ పార్ట్‌ను శరవేగంగా పూర్తిచేసుకుంది. యూటర్న్ చిత్రానికి కూడా కన్నడ దర్శకుడు పవన్ కుమార్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
 
ఇలా ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే సమంత సామాజిక సేవ చేస్తున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఎందరికో చేయూతను అందిస్తున్నారు సమంత. ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారుకుల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ప్రాణాంతక వ్యాధులతో బాధపడే మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఫోనాక్ అనే సంస్థ ద్వారా వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న ప‌దిమంది చిన్నారుల‌కి వినికిడి యంత్రాలు అందించారు. 
 
ఈ సంస్థ వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ని గుర్తించి ఉచిత శిబిరాలు నిర్వ‌హిస్తోంది. భవిష్య‌త్‌లో సంస్థ‌కి కావ‌ల‌సిన సాయం తాను అందిస్తానంటూ స‌మంత పేర్కొంది. సమంత మంచితనానికి నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments