Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను పొగిడేసిన సమంత.. యూటర్న్ నుంచి ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది..

కోలీవుడ్, టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ అయిన సమంత.. తాజాగా నయనతారను అభినందించింది. నయనతార తాజా చిత్రంగా తమిళంలో ''కోలమావు కోకిల'' సినిమా నిర్మితమైంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ న

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (16:21 IST)
కోలీవుడ్, టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ అయిన సమంత.. తాజాగా నయనతారను అభినందించింది. నయనతార తాజా చిత్రంగా తమిళంలో ''కోలమావు కోకిల'' సినిమా నిర్మితమైంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 5వ తేదీన ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు ఇప్పటికే 38లక్షల వ్యూస్‌ వచ్చాయి. 
 
ఈ ట్రైలర్ గురించి సమంత స్పందిస్తూ.. ''కొంచెం ఆలస్యంగా స్పందిస్తున్నానని తెలుసు. ట్రైలర్ చాలా బాగుంది. నయనతార నటన అద్భుతం ఆమె కీర్తి కిరీటంలో ఓ డైమండ్ స్టోన్‌లా ఈ సినిమా నిలిచిపోతుందని తెలిపింది. ఇంకా సినీ యూనిట్‌కు సమంత శుభాకాంక్షలు తెలిపింది. ఇకపోతే.. తనతోటి హీరోయిన్‌ను సమంత ప్రశంసించడం ఆమె పెద్ద మనసుకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. 
 
ఇకపోతే.. సమంత ప్రధాన పాత్రగా ''యూటర్న్'' సినిమా రూపొందుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఆమె న్యూస్ రిపోర్టర్‌గా కనిపించనుంది. రీసెంట్గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. భూమిక కీలకమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి సాధ్యమైనంత త్వరగా ఫస్టులుక్‌ను విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments