Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధు జొన్నలగడ్డ... జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

దేవీ
గురువారం, 13 మార్చి 2025 (11:52 IST)
Sidhu Jonnalagadda, Sam CS
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సిద్ధు, భాస్కర్‌ల క్రేజీ కాంబోకి తగ్గట్టుగానే జాక్ సినిమా ఉండబోతోందని టీజర్, పాటలు చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు.
 
ప్రస్తుతం జాక్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. సౌత్‌లో సామ్ సీఎస్‌కి సంగీత దర్శకుడిగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సీఎస్ ఈ జాక్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని (ఆర్ఆర్) అందిస్తున్నారు. రీసెంట్‌గా పుష్ప 2, సుడల్ 2లో శామ్ సీఎస్ అందించిన ఆర్ఆర్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.
 
బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతోన్న శామ్ సీఎస్ ఇక జాక్ సినిమాలో సిద్దుని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి పాటలు అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు దాదాపుగా 30 రోజులున్నాయి. ప్రస్తుతం మేకర్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
 
ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments