కొత్త పిల్లపై కన్నేసిన మెగా హీరో....

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (16:26 IST)
మెగా కాంపౌడ్ హీరో వరుణ్ తేజ్. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా, ఇటీవలికాలంలో వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. మరోవైపు, మల్టీస్టారర్ చిత్రాలు చేస్తూ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఈ మెగా హీరో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 
 
అయితే, ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ను తెలుగు వెండితెరకు పరిచయం చేయనున్నారు వరణ్ తేజ్. ఆమె పేరు సాయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. ఈమెను తన కొత్త చిత్రంలోని వరుణ్ తేజ్ ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈమె గతంలో బాలీవుడ్ చిత్రం దబాంగ్-3లో నటించి సందడి చేసింది. 
 
కాగా, తెలుగు తెరపై బాలీవుడ్ భామల జోరు కొనసాగుతోంది. పారితోషికం ఎంతైనా లెక్కచేయకుండా కొత్తదనం కోసం .. ప్రేక్షకులు కోరుకునే గ్లామర్‌ను అందించేందుకు దర్శకనిర్మాతలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ కోవలోనే తెలుగు తెరకి ఈ బాలీవుడ్ భామని పరిచయం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments