Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్రపతి కోసం హిందీ నేర్చుకుంటున్న సాయి శ్రీనివాస్‌

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (18:51 IST)
bellam konda
హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ టాలీవుడ్‌ హిట్‌ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వి వి వినాయక్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. 2005లో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్‌ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ సినిమా షూటింగ్‌ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు.
 
సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇందుకోసం ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్‌ విషయం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. అంతే కాదు...‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్‌ హిందీ కోచ్‌ ఇంతియాజ్‌ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌. 
 
‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌ను దక్షిణాది భాషల్లో డబ్బింగ్‌చేసి విడుదల చేయాలనుకుంటున్నారు.  వీవీ వినాయక్‌కు కూడా హిందీలో తొలి చిత్రం ఇదే కావడం విశేషం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments