Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ న‌టించిన గీత చిత్రంలో సాయి కిరణ్ విల‌న్‌

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (19:07 IST)
Hebba Patel, sunil
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న `గీత‌`చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా ప్రేమించు చిత్ర‌  హీరో  సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన "గీత" చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ ఆడియో సంస్థ "టిప్స్" ఈ చిత్రం ఆడియో హక్కులు దక్కించుకుంది.
 
వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకుని, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న "గీత" చిత్రం సెప్టంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది.
 
చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... "ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే "గీత" విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు"  అన్నారు. 
 
నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం." అన్నారు.
 
 హీరో సునీల్, హీరోయిన్ హెబ్బా పటేల్ "గీత" వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంలో నటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడుగా విశ్వ, నిర్మాతగా రాచయ్యలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. "గీత" చిత్రంలో పని చేసే అవకాశం లభించడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments