Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా నిలబెట్టి అన్నేసిసార్లు రీటేక్‌లు తీశారు... ఏడుపొచ్చేది...

"సేక్రెడ్ గేమ్స్... నెట్‌ఫ్లిక్స్" రూపొందించిన టీవీ సిరీస్‌కు విమర్శలతోపాటు ప్రశంసలూ వస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్ర

Webdunia
గురువారం, 12 జులై 2018 (12:50 IST)
"సేక్రెడ్ గేమ్స్... నెట్‌ఫ్లిక్స్" రూపొందించిన టీవీ సిరీస్‌కు విమర్శలతోపాటు ప్రశంసలూ వస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కుబ్రా సైత్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టించారు. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల‌తో స‌మానంగా వెబ్ సిరీస్‌ల‌కు కూడా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే మంచి ఆదరణ లభించగా, తెలుగులో ఈ ట్రెండ్ ఇపుడిపుడే మొదలవుతోంది.

 
అయితే, "సేక్రెడ్ గేమ్స్... నెట్‌ఫ్లిక్స్" వెబ్ సిరీస్‌లో కుక్కూగా ప‌లు న్యూడ్ సీన్ల‌లో న‌టించిన కుబ్రా సైత్ తాజాగా జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ సంద‌ర్భంగా న్యూడ్ సీన్ల గురించి మాట్లాడింది. 'ఈ వెబ్ సిరీస్‌లో నేను కుక్కూ అనే ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టించా. ఈ సిరీస్‌లో ప‌లు న్యూడ్ సీన్ల‌లో న‌టించాల్సి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ముందుగానే చెప్పారు. 
 
అయితే నేను న‌గ్నంగా న‌టించిన ప్ర‌తీ స‌న్నివేశాన్ని ప‌లుమార్లు చిత్రీక‌రించేవారు. అలా క‌నీసం ఏడు సార్లు రీ-టేక్‌లు అడిగేవారు. నగ్నంగా అన్నేసి సార్లు న‌టించాల్సి రావ‌డంతో నాకు ఏడుపు వ‌చ్చేసేది. సీన్ అందంగా రావ‌డం కోస‌మే అన్నేసి సార్లు చిత్రీక‌రిస్తున్నామ‌ని, త‌ప్పుగా భావించ‌వ‌ద్ద‌ని అనురాగ్ చెప్పేవార'ని కుబ్రా వెల్ల‌డించింది. ఈ సిరీస్‌లో తన పాత్ర పేరు ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్. 
 
సేక్రెడ్ గేమ్స్ టీవీ సిరీస్.. 2006లో వచ్చిన విక్రమ్ చంద్ర రాసిన బుక్ ఆధారంగా తెరకెక్కింది. 1980, 90ల్లో ముంబైలోని గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లు.. వాళ్ల మధ్య సినిమా నటులు పడిన ఇబ్బందులను ఈ బుక్‌లో రాశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం