Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాల కోసం పడక సుఖం.. ఇలియానా ఫైర్..

ఇన్నాళ్లు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఇల్లీ బ్యూటీ ఇలియానా.. ప్రస్తుతం బాలీవుడ్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. సినీ ప్రపంచపు చీకటి కోణంపై ఇలియానా ఓ పత్రికతో ధైర్యంగా మాట్లాడ

Advertiesment
అవకాశాల కోసం పడక సుఖం.. ఇలియానా ఫైర్..
, మంగళవారం, 13 మార్చి 2018 (16:53 IST)
ఇన్నాళ్లు దక్షిణాది సినీ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ఇల్లీ బ్యూటీ ఇలియానా.. ప్రస్తుతం బాలీవుడ్‌పై విమర్శనాస్త్రాలు సంధించింది. సినీ ప్రపంచపు చీకటి కోణంపై ఇలియానా ఓ పత్రికతో ధైర్యంగా మాట్లాడింది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం పడకసుఖం ఇవ్వడంపై ఇలియానా ఫైర్ అయ్యింది.

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా ప్రశ్నిస్తే.. ఆ తారల కెరీర్‌ ముగిసిపోతుందా? అనే ప్రశ్నకు ఇలియానా ఇలా బదులిచ్చింది. లైంగిక హింసపై ప్రశ్నించకపోవడం పిరికితనమని చెప్పింది.
 
అయితే అవకాశాలకు పడక సుఖం గురించి నోరెత్తితే మాత్రం కెరీర్ పతనమైనట్లేననే వాదనతో తాను ఏకీభవిస్తానని ఇలియానా చెప్తోంది. ఇందుకు దక్షిణాదిన చాలా ఏళ్ల క్రితం ఓ జూనియర్ ఆర్టిస్టు ఓ బడా నిర్మాతచే ఎదుర్కొన్న వేధింపులపై తన వద్ద సలహా కూడా అడిగిందని ఇల్లీ బ్యూటీ చెప్పింది.

కానీ అందుకు తానేమీ చెప్పలేకపోయానని.. ఈ విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోమని సూచించాననని వెల్లడించింది. లైంగిక వేధింపులకు తాను పూర్తి వ్యతిరేకమని ఇలియానా చెప్పుకొచ్చింది. అయితే ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌తో తన సంబంధాలపై, వ్యక్తిగత విషయాలపై నోరు విప్పేందుకు ఇలియానా నిరాకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ని పక్కల కింద నలిగితే ఎన్ని సినిమాలొస్తాయో నాకు తెలుసు : శ్రీరెడ్డి