Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' దెబ్బకు ప్రభాస్ కొత్త చిత్రం బడ్జెట్ వ్యయం కుదించారు

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (14:40 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ముఖ్యంగా, ఉత్తరాదిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా శభాష్ అనిపించుకున్నప్పటికీ.. సౌత్‌లో మాత్రం డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఫలితంగా చిత్ర పంపిణీదారులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఈ ప్రభావం ప్రభాస్ కొత్త మూవీపై పడింది. ఫలితంగా ఈ చిత్ర బడ్జెట్‌లో 40 శాతం మేరకు కోత విధించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సాహో తర్వాత ప్రభాస్ నటించే చిత్రానికి 'జిల్' పేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 
అయితే, దేశ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే సాహో తర్వాత ఈ మూవీ స్క్రిప్ట్‌లో దర్శకుడు భారీ మార్పులు చేశాడట. అంతేకాదు నిర్మాతలు కూడా ఈ మూవీ బడ్జెట్‌ను 40శాతం తగ్గించారట. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని రూ.120 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌లో నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానుండగా.. ఎలాంటి విరామాలు లేకుండా షూటింగ్‌‌ను ‌జరపనున్నారట. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments