Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొహైల్ జోడీగా రూప కొడువయూర్

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (13:28 IST)
Rupa Koduvayoor, Sohail
"ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నాయిక రూప కొడువయూర్ బిగ్ బాస్ ఫేం సొహైల్ హీరోగా నటిస్తున్న మూవీలో హీరోియన్ గా కనిపించనుంది. మైక్ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్న ఈ సినిమాలో నాయికగా రూప కొడువయూర్ ఎంపికైంది. హోలీ పండగ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవలే మైక్ మూవీస్, సొహైల్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
 
"జార్జ్ రెడ్డి", "ప్రెజర్ కుక్కర్" లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఇవాళ్టి సొసైటీలో ఓ బర్నింగ్ ఇష్యూను కథలో చూపించబోతున్నారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని హీరో సొహైల్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గతంలో తెలిపారు. నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు.
 
సయ్యద్ సోహైల్ రియాన్, రూప కొడువయూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి  మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ,  ఆర్ట్: గాంధీ నడికుడికార్, నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల  రవిరెడ్డి, రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments