యానాంలో రుద్రవీణ షూటింగ్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (17:15 IST)
Rudraveena opening
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రవీణ. రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సాయి వీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా యానాం లో రుద్రవీణ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది.
 
సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రుద్రవీణ సినిమాను తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు.
 
ఛమ్మక్ చంద్ర, చలాకీ చంటి, ధన్ రాజ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, జీఎల్ఎన్ బాబు, సంగీతం - మహావీర్ యెలేందర్, ఆర్ట్ - భూపతి యాదగిరి, ఎడిటర్ - జి నాగేశ్వర్ రెడ్డి, స్టంట్స్ - రియల్ సతీష్, ప్రత్యేక పర్యవేక్షణ - కె త్రివిక్రమ రావు,  నిర్మాత - రాగుల లక్ష్మణ్, కథ , కథనం ,దర్శకత్వం - జి మధుసూదన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments