Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ విడుదలపై షాకింగ్ న్యూస్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:25 IST)
దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. విడుదల తేదీ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా అభిమానులకు ఈ తాజా బజ్‌తో నిరాశే ఎదురైంది. 
 
తాజా సమాచారం ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతీ కారణంగా మూవీ షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంకా క్లైమాక్స్‌ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్‌ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ముందుగా అనుకున్న డేట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేయడం కుదరదని, మరోసారి విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వినికిడి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు సమాచారం.
 
మిగిలిన షూటింగ్‌కు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా 6 నెలల సమయం పడుతుందని, అందుకే 2022 సమ్మర్‌కు విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్‌ కూడా భావిస్తున్నట్లు సమాచారం. కాగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ మూవీపై బీ-టౌన్‌లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. 
 
ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారం కూడా పూర్తయ్యింది. బాహుబలి కంటే హై రేంజ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అన్ని వైపుల నుంచి కూడా పెట్టిన పెట్టుబడికి ఈజీగా ప్రాఫిట్స్ అందించగలదని అనుకుంటున్నారు. ఈ సినిమా దాదాపు 900కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments