Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌.ఆర్‌.ఆర్‌. అతి పెద్ద డీల్‌

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:44 IST)
RRR
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.`. డి.వి.వి. దాన‌య్య నిర్మాత‌. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. న‌టిస్తున్న ఈ సినిమాలో కొమ‌రం భీమ్ పాత్ర కొత్త స్టిల్‌ను ఆయ‌న పుట్టిన‌రోజైన ఈనెల 20న రాజ‌మౌళి విడుద‌ల చేశాడు. అది ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. కాల్ప‌నిక క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే నార్త్ ఇండియా డిజిట‌ల్ రైట్స్‌ను 140 కోట్ల‌కు తీసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.
 
కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు చెందిన అన్ని ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్, శాటిలైట్‌ హ‌క్కులను పెన్ స్టూడియోస్ అధినేత జ‌యంతీలాల్ గ‌డా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు 475 కోట్ల డీల్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న్నుంచి జీ గ్రూప్ శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌ను 325 కోట్ల‌కు చేజిక్కించుకున్న‌ద‌ని స‌మాచారం. ఇది సినిమా చ‌రిత్ర‌లోనే అతి పెద్ద డీల్‌గా ప‌రిశ్ర‌మ‌లో టాక్ నెల‌కొంది. ఇక ఈ సినిమాను థియేట‌ర్ల‌లో హిందీ వ‌ర్ష‌న్‌ను మాత్ర‌మే పంపిణీ చేస్తార‌ట‌. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా ఈ సినిమాను విడుద‌ల చేయాలని అనుకున్నారు. మ‌రి అప్పుడు విడుద‌ల అవుతుందా? లేదా? అనేది సందిగ్థంలోనే వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments